కోడి గుడ్డే కదా అనుకుంటే ప్రాణం తీసింది!

92
Boiled Egg

దిశ, వెబ్‌డెస్క్ : కోడిగుడ్డును గట్టిగా పట్టుకున్నా పగిలిపోతుంది. కిరాణ షాపు నుంచి ఇంటి వరకు తీసుకెళ్లాలన్నా పెద్ద సాహసమే చేయాలి. కానీ దానిని ఉడకబెడితే కాస్తా గట్టిగా మారుతుంది. పోషకాల మెండు అయిన ఈ గుడ్డును అందరూ పౌష్టికాహారంగా తీసుకుంటారు. అయితే అదే గుడ్డు ఓ మహిళా ప్రాణాలను తీసింది. ఒంట్లో బలం పెంచుకోవాలని చూసిన ఆమెకు బతుకే లేకుండా పోయింది. ఇంతకూ ఆమె ఎలా చనిపోయిందంటే..

నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం నేరళ్లపల్లి గ్రామానికి చెందిన నీలమ్మ (50) మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తుంది. ఈ క్రమంలో ఉడకబెట్టిన కోడిగుడ్డును తినేందుకు నోట్లో పెట్టుకోగా అది గొంతులోకి జారి ఇరుక్కుపోయింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు గొంతులో ఇరుక్కున గుడ్డును బయటకు తీసేందుకు ప్రయత్నించినా విఫలం అయింది. దీంతో ఆమె ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. కాగా, నీలమ్మ గుడ్డును ముక్కలు కట్ చేయకుండా అలాగే నోట్లో వేసుకుని నమిలేందుకు ప్రయత్నించగా.. అది జారి గొంతులో ఇరుక్కున్నట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి జరగగా గురువారం వెలుగులోకి వచ్చింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..