- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భర్తను కొట్టి చంపిన భార్య
by Batti.Sumithra |
<p>దిశ, సూర్యాపేట: దంపతుల మధ్య గొడవ నేపథ్యంలో క్షణికావేశంలో రోకలి బండతో భర్తను భార్య హత్య చేసింది. ఈ ఘటన సూర్యపేట జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..పాశ్యా నాయక్ తండాకు చెందిన ధరవత్ శంకర్ (45) హమాలి పని చేసుకుంటూ, ఇంటి వద్ద ఉన్న కొంత వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటూ ఉండేవాడు. పనికి వెళ్తే వచ్చే డబ్బులతో మద్యం సేవించి ఇంటి వద్ద ఉన్న భార్య కవితను తరుచూ కొట్టేవాడు. […]</p>

X
దిశ, సూర్యాపేట: దంపతుల మధ్య గొడవ నేపథ్యంలో క్షణికావేశంలో రోకలి బండతో భర్తను భార్య హత్య చేసింది. ఈ ఘటన సూర్యపేట జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..పాశ్యా నాయక్ తండాకు చెందిన ధరవత్ శంకర్ (45) హమాలి పని చేసుకుంటూ, ఇంటి వద్ద ఉన్న కొంత వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటూ ఉండేవాడు. పనికి వెళ్తే వచ్చే డబ్బులతో మద్యం సేవించి ఇంటి వద్ద ఉన్న భార్య కవితను తరుచూ కొట్టేవాడు.
రోజు మాదిరి గానే మంగళవారం ఉదయం కూడా భార్యతో శంకర్ గొడవపడ్డాడు. కాగా ఈ నేపథ్యంలో క్షణికావేశంలో శంకర్ తలపై భార్య కవిత రోకలిబండతో బలంగా కొట్టింది. దీంతో శంకర్ అక్కడికక్కడే మరణించాడు. ఘటనా స్థలాన్ని సూర్యాపేట రూరల్ సీఐ విఠల్ రెడ్డి, ఎస్సై లోకేశ్ పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






