రోగి మెడలో బంగారు గొలుసు చోరీ చేసిన వార్డు బాయ్..

by Batti.Sumithra |   (  Updated:2021-08-09 10:52:42  IST  )

<p>దిశ, కూకట్‌పల్లి: గుండె నొప్పితో ఆసుపత్రి వచ్చిన మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసును దొంగిలించిన వార్డు బాయిని కేపీహెచ్​బీ పోలీసులు సోమవారం రిమాండ్​కు తరలించారు. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం నిజాంపేట్​ బండారి లేఔట్ ​శ్రీచరణ్​ అబోడ్స్ ​అపార్ట్​మెంట్ ​లో నివాసం ఉంటున్నాడు కాసర్ల గోపి. ఈ నెల 5వ తేదిన తమ నానమ్మకు గుండె నొప్పి రావడంతో ఆంబులెన్స్​లో నిజాంపేట్​ రోడ్డులోని హోలిస్టిక్​ హాస్పిటల్​కు తరలించారు. ఆసుపత్రిలోకి వెళ్లిన తరువాత [&hellip;]</p>

రోగి మెడలో బంగారు గొలుసు చోరీ చేసిన వార్డు బాయ్..
X

దిశ, కూకట్‌పల్లి: గుండె నొప్పితో ఆసుపత్రి వచ్చిన మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసును దొంగిలించిన వార్డు బాయిని కేపీహెచ్​బీ పోలీసులు సోమవారం రిమాండ్​కు తరలించారు. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం నిజాంపేట్​ బండారి లేఔట్ ​శ్రీచరణ్​ అబోడ్స్ ​అపార్ట్​మెంట్ ​లో నివాసం ఉంటున్నాడు కాసర్ల గోపి. ఈ నెల 5వ తేదిన తమ నానమ్మకు గుండె నొప్పి రావడంతో ఆంబులెన్స్​లో నిజాంపేట్​ రోడ్డులోని హోలిస్టిక్​ హాస్పిటల్​కు తరలించారు. ఆసుపత్రిలోకి వెళ్లిన తరువాత ఆమె మెడలో ఉన్న 3 తులాల బంగారు గొలుసు లేక పోవడాన్ని గమనించిన గోపి ఆసుపత్రి యాజమాన్యానికి సమాచారం అందించారు.

ఇదిలా ఉండగా ఈ నెల 7వ తేదీన గోపి కేపీహెచ్‌బీ పోలీస్​స్టేషన్​లో కూడా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గోపి నానమ్మను ఆసుపత్రిలోకి తరలించే క్రమంలో వార్డు బాయి బంగారు గొలుసు దొంగిలించి ఉండవచ్చునన్న అనుమానంతో వార్డు బాయిగా పని చేస్తున్న జక్కి రాముడు(20)ను అదుపులో తీసుకుని విచారించారు. దీంతో బంగారు గొలుసును తనే దొంగిలించినట్టు వార్డు బాయ్ రాముడు నేరం అంగీకరించాడు. దీంతో పోలీసులు రాముడు వద్ద నుంచి 3 తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని రిమాండ్​కు తరలించారు.

Next Story