- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మంత్రిగారూ… మా ఊరికి భగీరథ నీళ్లొస్తలేవు’
<p>దిశ, హుస్నాబాద్: ‘మంత్రిగారు… మా ఊరికి మిషన్ భగీరథ నీళ్లొస్తలేవు’ అని సిద్దిపేట జిల్లా కొహెడ మండలం తంగళ్లపల్లి గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా సోమవారం గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ… గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామంలోని పల్లివాగు ఉధృతంగా ప్రహించడంతో వాగు ఒడ్డున ఉన్న బావితో పాటు, దుర్గమ్మబావి ద్వారా గ్రామానికి తాగునీరందించే బావులు కూడా పూర్తిగా నీటమునిగాయన్నారు. దీంతో బావులలోని నీరు కలుషితం కావడంతో గ్రామంలో తీవ్రమైన నీటికొరత ఏర్పడిందని ఆవేదన […]</p>

X
దిశ, హుస్నాబాద్: ‘మంత్రిగారు… మా ఊరికి మిషన్ భగీరథ నీళ్లొస్తలేవు’ అని సిద్దిపేట జిల్లా కొహెడ మండలం తంగళ్లపల్లి గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా సోమవారం గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ… గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామంలోని పల్లివాగు ఉధృతంగా ప్రహించడంతో వాగు ఒడ్డున ఉన్న బావితో పాటు, దుర్గమ్మబావి ద్వారా గ్రామానికి తాగునీరందించే బావులు కూడా పూర్తిగా నీటమునిగాయన్నారు.
దీంతో బావులలోని నీరు కలుషితం కావడంతో గ్రామంలో తీవ్రమైన నీటికొరత ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 15 రోజలుగా మిషన్ భగీరథ నీరు రావడం లేదని సంబంధిత అధికారులకు చెప్పినా… పట్టించుకున్న పాపానపోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైన జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే సతీశ్ కుమార్ స్పందించి తాగునీరందించాలని కోరుతున్నారు.
Next Story






