సర్పంచ్ భర్త సజీవ దహనం

by Batti.Sumithra |

<p>దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ గ్రామ సర్పంచ్ భర్తను ప్రత్యర్థులు సజీవ దహనం చేశారు. ఈ ఘటన అమేథి పరిధి భడోయా గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. భడోయా గ్రామ పెద్ద చోట్కా దేవి భర్త అర్జున్ కోరి(45)ని ప్రత్యర్థులు నిప్పంటించి తగులబెట్టారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఐదుగురిపై ఫిర్యాదు చేయగా, పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. గురువారం సాయంత్రం తన తండ్రి కూరగాయలు కొనే [&hellip;]</p>

సర్పంచ్ భర్త సజీవ దహనం
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ గ్రామ సర్పంచ్ భర్తను ప్రత్యర్థులు సజీవ దహనం చేశారు. ఈ ఘటన అమేథి పరిధి భడోయా గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. భడోయా గ్రామ పెద్ద చోట్కా దేవి భర్త అర్జున్ కోరి(45)ని ప్రత్యర్థులు నిప్పంటించి తగులబెట్టారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఐదుగురిపై ఫిర్యాదు చేయగా, పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. గురువారం సాయంత్రం తన తండ్రి కూరగాయలు కొనే నిమిత్తం మార్కెట్‌కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ దారుణానికి పాల్పడ్డారని మృతుడి కుమారుడు సురేంద్ర కుమార్ తెలిపారు.

Next Story