యూఎస్ ఓపెన్ నిర్వహణకు సిద్ధం

by  |
యూఎస్ ఓపెన్ నిర్వహణకు సిద్ధం
X

దిశ, స్పోర్ట్స్: టెన్నిస్ గ్రాండ్ స్లామ్స్‌లో ఒకటైన యూఎస్ ఓపెన్‌ను నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు నిర్వాహక కమిటీ సన్నాహాలు చేస్తున్నదని, ఈ వారంలోనే ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ది యునైటెడ్ స్టేట్స్ టెన్నిస్ అసోసియేషన్ (యూఎస్‌టీఏ) ప్రతి ఏడాది ఈ టోర్నీని న్యూయార్క్ నగరంలో నిర్వహిస్తున్నది. కాగా, కరోనా మహమ్మారికి అమెరికాలో కేంద్రంగా ఉన్న న్యూయార్క్‌లో ఈసారి టోర్నీ జరుగుతుందా అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే, ప్రేక్షకులు లేకుండా బయోసెక్యూర్ స్టేడియంలో టోర్నీ జరపాలని నిర్వాహకులు నిర్ణయించారు. కాగా, ఇప్పుడు స్టార్ ప్లేయర్లు ఈ టోర్నీకి అందుబాటులో ఉంటారా లేదా అనేదే సమస్యగా మారింది. రోజర్ ఫెదరర్ ఎలాగూ ఈ ఏడాది టెన్నిస్ ఆడనని ప్రకటించాడు. ఇక నోవాక్ జకోవిచ్, రఫెల్ నాదల్ సహా మిగతా ప్లేయర్లు యూఎస్ ఓపెన్ ఆడటానికి సిద్ధమైనా కొన్ని నిబంధనలు మార్చాలని కోరుతున్నారు. ఖాళీ స్టేడియంలో ఆడటం కొంచెం ఇబ్బందే. అయితే టెన్నిస్ ప్లేయర్ వెంట ఒకరే రావాలనే నిబంధన మాకు అడ్డంకి కాబోతోందని జకోవిచ్ అంటున్నారు. మా వెంట కోచ్‌తోపాటు ఫిట్‌నెస్ ట్రైనర్, ఫిజియోథెరపిస్ట్ కూడా ఉంటారు. మరి ఒకరే ఉండాలనే నిబంధన ఎలా విధిస్తారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు నిర్వాహకులు ఈసారి క్వాలిఫైయింగ్ రౌండ్లు ఉండవని చెబుతున్నారు. గతంలో 64 జంటలను డబుల్స్‌లో ఆడించేవాళ్లు. ఈసారి మాత్రం కేవలం 24 జంటలకే అవకాశం ఇవ్వబోతున్నారు. మరోవైపు న్యూయార్క్‌లో నిర్వహించే యూస్ టోర్నీకి ముందు అదే స్టేడియంలో సిన్‌సినాటీ మాస్టర్స్ ఈవెంట్ కూడా నిర్వహిస్తామని చెబుతున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed