తెలంగాణలో కలకలం.. దేవతల విగ్రహాలు ధ్వంసం

by Shyam |   (  Updated:2021-01-25 01:17:17  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం జరిగి..ఇప్పుడిప్పుడే సామాన్య పరిస్థితులు వస్తున్న తరుణంలోనే ఇప్పుడు తెలంగాణలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఆలయంలో దేవతల విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. ఆదివారం రాత్రి కూకట్‌పల్లి సప్ధర్‌నగర్‌లోని దుర్గామాత ఆలయంలో విగ్రహాన్ని పెకిలించిన గుర్తుతెలియని వ్యక్తులు, నాగదేవత విగ్రహాలను కూడా ధ్వంసం చేసి పరారయ్యారు. ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.</p>

తెలంగాణలో కలకలం.. దేవతల విగ్రహాలు ధ్వంసం
X

దిశ, వెబ్‌డెస్క్: కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం జరిగి..ఇప్పుడిప్పుడే సామాన్య పరిస్థితులు వస్తున్న తరుణంలోనే ఇప్పుడు తెలంగాణలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఆలయంలో దేవతల విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. ఆదివారం రాత్రి కూకట్‌పల్లి సప్ధర్‌నగర్‌లోని దుర్గామాత ఆలయంలో విగ్రహాన్ని పెకిలించిన గుర్తుతెలియని వ్యక్తులు, నాగదేవత విగ్రహాలను కూడా ధ్వంసం చేసి పరారయ్యారు. ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Next Story