- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ తరగతి వరకు విద్యార్థులందరూ పాస్?
<p>దిశ, వెబ్‌డెస్క్: అసలే కరోనా మళ్లీ విజృంభిస్తోంది. స్కూల్ ఏమో కానీ.. తమ పిల్లలు సేఫ్‌గా ఉంటే చాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో.. తమ పిల్లలను స్కూల్‌కి పంపించేందుకు వెనకడుగు వేస్తున్నారు. స్కూళ్లల్లో పలువురు విద్యార్థులు, టీచర్లకు కరోనా సోకడంతో.. పేరెంట్స్ మరింత భయపడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. స్కూళ్ల నిర్వహణకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో ప్రకటన చేస్తామని నిన్న అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించడం చర్చనీయాంశంగా […]</p>

దిశ, వెబ్‌డెస్క్: అసలే కరోనా మళ్లీ విజృంభిస్తోంది. స్కూల్ ఏమో కానీ.. తమ పిల్లలు సేఫ్‌గా ఉంటే చాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో.. తమ పిల్లలను స్కూల్‌కి పంపించేందుకు వెనకడుగు వేస్తున్నారు. స్కూళ్లల్లో పలువురు విద్యార్థులు, టీచర్లకు కరోనా సోకడంతో.. పేరెంట్స్ మరింత భయపడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. స్కూళ్ల నిర్వహణకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో ప్రకటన చేస్తామని నిన్న అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
కేసీఆర్ ప్రకటనతో మళ్లీ స్కూళ్లను మూసివేసే అవకాశముందని వార్తలొస్తున్నాయి. ఆ లోపే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. 8వ తరగతి వరకు విద్యార్థులకు క్లాసులు బంద్ చేయాలని నిర్ణయించినట్లు వార్తలొస్తున్నాయి. అలాగే 8 తరగతి వరకు విద్యార్థులను పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోట్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోందట.
ఇక 9,10 తరగతి విద్యార్థులకు ప్రత్యక్ష బోధనను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.






