- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులను పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వం: బీజేపీ నేత శ్యామ్ సుందర్.
<p>దిశ, గుండాల: యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ తహసీల్దార్ కార్యాలయం, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పీ.వీ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సోయి మరిచి రైతులను మోసం చేసే ప్రక్రియకు పునాదులు వేసిందని, ఆగ మేఘాల మీద కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది కానీ కొనుగోలు అయితే ప్రారంభించలేదని ఎద్దేవా చేశారు. […]</p>

దిశ, గుండాల: యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ తహసీల్దార్ కార్యాలయం, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పీ.వీ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సోయి మరిచి రైతులను మోసం చేసే ప్రక్రియకు పునాదులు వేసిందని, ఆగ మేఘాల మీద కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది కానీ కొనుగోలు అయితే ప్రారంభించలేదని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ మాటలు ప్రజలు నమ్మేలా లేరని, తక్షణమే రైతులు వద్ద ధాన్యం కొనుగోలు జరపాలని తెలిపారు. కార్యక్రమంలో పి. జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర కిసాన్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు జి. సత్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొంతి శివ కుమార్ రెడ్డి, మరాఠీ బీరప్ప, గుండాల మండల అధ్యక్షుడు జక్కుల రాంచందర్ యాదవ్, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడు చేడే నాగన్న, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు వివాకర్ రెడ్డి, మలిపెద్ది యాదిరెడ్డి, రుద్ర, శ్రీను, విజయ్ రెడ్డి, ప్రశాంత్, సురేష్, వజీర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.






