తాలిబాన్ల పైశాచికం.. అఫ్ఘన్ మహిళల కోసం వింత చట్టం

by Anukaran |   ( Updated:2021-12-04 06:06:09.0  )
తాలిబాన్ల పైశాచికం.. అఫ్ఘన్ మహిళల కోసం వింత చట్టం
X

దిశ, వెబ్ డెస్క్: మహిళలపై చిత్ర విచిత్ర ఆంక్షలతో ప్రపంచం ముందు దోషిగా నిలుచున్న తాలిబాన్లు దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. ఇంతకు ముందు అమ్మాయిలు సీరియల్స్ లో నటించ రాదు అని హుకుం జారీ చేసిన విషయం తెలిసిందే. అంతటితో ఆగకుండా ఆడ పిల్లల చదువుల పై కూడా అనేక ఆంక్షలు పెట్టారు. అయితే ఇప్పుడు మహిళలకు ఊరట నిచ్చే నిర్ణయం తీసుకున్నారు. ఇక పై అఫ్ఘన్ లో బలవంతపు పెళ్లిళ్లు జరగకూడదని తాలిబాన్ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక పై బలవంతపు పెళ్లిళ్లు చెల్లవని తేల్చి చెప్పింది. మా దృష్టిలో స్త్రీ , పురుషులు సమానమని కల్లబుల్లి మాటలు చెబుతున్నారు. అయితే అఫ్ఘన్ తెగలలో ఓ వింత ఆచారం ఉంది. భర్త చనిపోయిన తర్వాత వితంతువులు అలాగే ఉండకూడదు. వారికి మరో పెళ్లి చేయాలి. కానీ తెగ ఆచారం ప్రకారం బయటి వారు కాకుండా చనిపోయిన వ్యక్తి సోదరులలో ఎవరినో ఒకరిని వివాహం చేసుకోవచ్చు. ఇలాంటి చోట ఇష్టం లేకుండా పెళ్లిళ్లు జరుగుతుంటాయి. ఇలాంటి వాటిని నివారించడానికే కొత్త నిర్ణయం తీసుకున్నాం అని తాలిబాన్ అధిపతి హిబతుల్లా అఖుంద్ జా తెలిపారు. అయితే ఈ నిబంధనలు కేవలం అంతర్జాతీయ సమాజం ముందు చెప్పుకోవడానికే అని, ఇంకా అక్కడ బాల్య వివాాహాలు చేస్తున్నారని, డబ్బులకు అమ్మాయిలను కొనుగోలు చేస్తున్నారని అంతర్జాతీయ మీడియా చెబుతోంది.

Next Story

Most Viewed