'లోకేశ్! ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి'

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-08-22 03:55:35  IST  )

<p>దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై రాష్ట్ర పోలీస్ అసోషియేషన్ అసహనం వ్యక్తం చేసింది. గుంటూరు ఏటీ అగ్రహారంలో జరిగిన ఒక సంఘటనను నారా లోకేష్ రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరమని అభిప్రాయపడింది. జరిగిన విషయాన్ని తెలుసుకోకుండా అత్యాచార ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికింది. ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన పోలీస్ అసోషియేషన్ డ్రామాను మరిపించే విధంగా లోకేష్ విధానం ఉందని అభిప్రాయపడింది. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా లోకేష్ [&hellip;]</p>

lokesh
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై రాష్ట్ర పోలీస్ అసోషియేషన్ అసహనం వ్యక్తం చేసింది. గుంటూరు ఏటీ అగ్రహారంలో జరిగిన ఒక సంఘటనను నారా లోకేష్ రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరమని అభిప్రాయపడింది. జరిగిన విషయాన్ని తెలుసుకోకుండా అత్యాచార ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికింది. ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన పోలీస్ అసోషియేషన్ డ్రామాను మరిపించే విధంగా లోకేష్ విధానం ఉందని అభిప్రాయపడింది.

పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా లోకేష్ వ్యాఖ్యలు చేస్తున్నారని.. అవాస్తవ ఆరోపణలను ఆయన వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు వచ్చిన కానిస్టేబుల్‌‌ను తక్షణమే సస్పెండ్ చేయడం మరియు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగిందని వివరించారు. రాష్ట్రంలో మహిళల రక్షణకు పోలీసు వ్యవస్థ పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే పోలీసు వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని అసోషియేషన్ అభిప్రాయపడింది.

Next Story