- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోంది
<p>దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో 2015-16 తర్వాత రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, రైతులకు అండగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.799 కోట్లు కేటాయించిందని ఎమ్మెల్యే రాజాసింగ్తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆ డబ్బు అందించకుండా ఏడాది పాటు అడ్డుకుందన్నారు. గులాబ్తుఫాన్కారణంగా పంటనష్టం జరిగి అన్నదాతలు ఎంతోమంది ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 2017లో రైతులకు ప్రయోజనకరంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఫసల్‌బీమా యోజన పథకాన్ని తీసుకొచ్చిందని, […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో 2015-16 తర్వాత రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, రైతులకు అండగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.799 కోట్లు కేటాయించిందని ఎమ్మెల్యే రాజాసింగ్తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆ డబ్బు అందించకుండా ఏడాది పాటు అడ్డుకుందన్నారు. గులాబ్తుఫాన్కారణంగా పంటనష్టం జరిగి అన్నదాతలు ఎంతోమంది ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
2017లో రైతులకు ప్రయోజనకరంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఫసల్‌బీమా యోజన పథకాన్ని తీసుకొచ్చిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించక పెండింగ్‌లో ఉందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి సబ్సిడీలు అందించడంలేదన్నారు. రాయితీలు, ఫసల్బీమాలాంటి పథకాలను రైతులకు వర్తింపజేస్తే రాష్ట్రంలో రైతుల చావులుండవని చెప్పారు. రూ.లక్ష రుణమాఫీ అని చెప్పి ఇప్పటి వరకు రూ.25వేలు మాత్రమే మాఫీ చేశారని, మిగిలిన మొత్తాన్ని కూడా మాఫీ చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రభుత్వాన్నిడిమాండ్చేశారు.
ధూల్‌పేట ప్రజలపై గుడుంబా, గంజాయి అమ్ముతున్నారని పోలీసులు దాడులు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అలా నిజంగా తప్పులు చేసిన వారిని శిక్షించవచ్చు.. కానీ అతడి కుటుంబసభ్యులను కూడా పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని, నిర్దోషులకు ఇబ్బందులు ఎదురవ్వకుండా చూడాలన్నారు.






