- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యం తాగిన మామ హత్య..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : మద్యం మత్తుకు క్షణికావేశం తోడుకావడంతో ఒకరి ప్రాణం పోయింది. సరదాగా తాగినా.. ఆ మైకంలో ఘర్షణ పడి జీవితాన్ని జైలు పాలుచేసుకున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని చినముషిడివాడలో జరిగిన ఈ ఘటన ఎలా జరిగిందంటే.. చినముషిడివాడకు చెందిన శంకర్, చిన్నా మామ, అల్లుడు. శుక్రవారం ఇద్దరు మద్యం సేవించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. దీంతో మామఅల్లుడు ఘర్షణ పడ్డారు. తాగిన మత్తులో ఉన్న చిన్నా.. మామ శంకర్‌పై […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : మద్యం మత్తుకు క్షణికావేశం తోడుకావడంతో ఒకరి ప్రాణం పోయింది. సరదాగా తాగినా.. ఆ మైకంలో ఘర్షణ పడి జీవితాన్ని జైలు పాలుచేసుకున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని చినముషిడివాడలో జరిగిన ఈ ఘటన ఎలా జరిగిందంటే..
చినముషిడివాడకు చెందిన శంకర్, చిన్నా మామ, అల్లుడు. శుక్రవారం ఇద్దరు మద్యం సేవించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. దీంతో మామఅల్లుడు ఘర్షణ పడ్డారు. తాగిన మత్తులో ఉన్న చిన్నా.. మామ శంకర్‌పై ఇనుప రాడ్‌తో దాడి చేశాడు. తీవ్రగాయాల పాలైన శంకర్.. అక్కడికక్కడే హతమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని చిన్నాను అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణ సమయంలో అక్కడే ఉన్న శంకర్ బావమరిది అశోక్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. హత్య గల కారణాలను తెలుసుకుంటున్నారు.
Next Story






