- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కన్నతల్లిని గెంటేసిన కొడుకులు.. రోడ్డుమీద రోధిస్తున్న అవ్వ
<p>దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. నవమాసాలు మోసి, పెంచి పెద్దచేసిన కన్నతల్లి పట్ల కుమారులు కర్కషంగా ప్రవర్తించారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడలో శనివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… హమాలివాడలో నివాసం ఉంటున్న లెక్కల సుభద్ర అనే వృద్ధ మహిళకు మహేష్, సురేష్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వృద్ధురాలు కావడంతో బాగోగులు చూస్తారని చేరో నెల కొడుకుల వద్ద ఉంటోంది. ప్రస్తుతం పెద్ద కొడుకు మహేష్ దగ్గర […]</p>

దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. నవమాసాలు మోసి, పెంచి పెద్దచేసిన కన్నతల్లి పట్ల కుమారులు కర్కషంగా ప్రవర్తించారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడలో శనివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… హమాలివాడలో నివాసం ఉంటున్న లెక్కల సుభద్ర అనే వృద్ధ మహిళకు మహేష్, సురేష్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వృద్ధురాలు కావడంతో బాగోగులు చూస్తారని చేరో నెల కొడుకుల వద్ద ఉంటోంది. ప్రస్తుతం పెద్ద కొడుకు మహేష్ దగ్గర ఉంటుండగా, తల్లి భారం అనిపించి, ఇంట్లోంచి గెంటేశారు. దీంతో ఏం చేయాలో, ఎక్కడకి వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో నడుచుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మెట్లపై సొమ్మసిల్లి పడిపోయింది. గమనించిన స్థానికులు ఆ వృద్ధురాలికి నీళ్లు తాగించారు. వృద్ధాప్యంలో తల్లిని గెంటేసిన కొడుకుపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.







