చిత్తూరులో దారుణం.. అక్కాచెల్లెళ్ల హత్య

126

దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా మదనపల్లిలో దారుణం చోటుచేసుకుంది. టీచర్స్ కాలనీ నివాసం ఉంటున్న పురుషోత్తం నాయుడు కూతుళ్లు ఆలేఖ్య(27), సాయి దివ్య(22)ను ఇంట్లోనే బంధించి గుర్తు తెలియని దుండగులు హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. పురుషోత్తం నాయుడు ఉమెన్స్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా చేస్తున్నారు. ఆయన భార్య పద్మజ మాస్టర్ మైండ్స్ కాలేజీ అధినేత. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, విచారణ చేపట్టారు. కన్నవాళ్లే తమ పిల్లలను చంపేశారనే వదంతులు వినిపిస్తున్నాయి. పోలీసులు మృత దేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దర్యాప్తు చేసి నిజమేంటో నిగ్గు తేలుస్తామని వెల్లడించారు. ప్రభుత్వాసుపత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అంతేగాకుండా తల్లి మానస్థితి సరిగా ఉండదని, పిల్లలను తల్లే హత్య చేసి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..