- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూలిన హాస్టల్ భవనం పైకప్పు.. ప్రమాద సమయంలో 30 మంది విద్యార్థులు
by Shyam |
<p>దిశ, నాగర్‌కర్నూల్ : జిల్లా కేంద్రంలో విద్యార్థులు నివాసముంటున్న ఆనంద నిలయం హాస్టల్ పైకప్పు బుధవారం సాయంత్రం ఒక్కసారిగా కూలిపడింది. భోజనాలు పూర్తి చేసుకున్న విద్యార్థులు మరికొద్ది నిమిషాల్లో నిద్రకు ఉపక్రమించేందుకు సిద్ధమవుతున్నారు. అంతలోనే పెద్ద శబ్దం రావడంతో విద్యార్థులంతా భవనం బయటకు పరుగులు తీశారు. వెంటనే హాస్టల్ పైకప్పు ఊడిపడింది. ఈ ఘటన సాయంత్రం 7గంటల సమయంలో జరిగింది. అక్కడే ఉన్న వార్డెన్ భాస్కర్ విద్యార్థులను చేరదీసి ధైర్యం చెప్పారు. కాగా హాస్టల్‌లో పనిచేస్తోన్న వంటమనిషికి […]</p>

X
దిశ, నాగర్‌కర్నూల్ : జిల్లా కేంద్రంలో విద్యార్థులు నివాసముంటున్న ఆనంద నిలయం హాస్టల్ పైకప్పు బుధవారం సాయంత్రం ఒక్కసారిగా కూలిపడింది. భోజనాలు పూర్తి చేసుకున్న విద్యార్థులు మరికొద్ది నిమిషాల్లో నిద్రకు ఉపక్రమించేందుకు సిద్ధమవుతున్నారు. అంతలోనే పెద్ద శబ్దం రావడంతో విద్యార్థులంతా భవనం బయటకు పరుగులు తీశారు. వెంటనే హాస్టల్ పైకప్పు ఊడిపడింది. ఈ ఘటన సాయంత్రం 7గంటల సమయంలో జరిగింది.
అక్కడే ఉన్న వార్డెన్ భాస్కర్ విద్యార్థులను చేరదీసి ధైర్యం చెప్పారు. కాగా హాస్టల్‌లో పనిచేస్తోన్న వంటమనిషికి ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతరం అందులో నివాసముండే 30 మంది విద్యార్థులను ఇతర హాస్టల్‌లో సర్దుబాటు చేసినట్లు వార్డెన్ తెలిపారు. కాగా శిథిలావస్థకు చేరిన భవనంలో విద్యార్థులకు వసతి కల్పించడంపై స్థానికులు మండిపడుతున్నారు.
Next Story






