- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రంగనాథస్వామి ఆలయంలో చోరీ.. మూడు హుండీలు పగలగొట్టి..
<p>దిశ, మునుగోడు : చౌటుప్పల్ మండల పరిధిలోని పీపల్ పహాడ్ గ్రామంలో గల రంగనాథస్వామి ఆలయంలో జరిగింది. ఈ చోరీ విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పీపల్ పహాడ్ గ్రామంలోని రంగనాథస్వామి ఆలయంలో మూడు హుండీలను పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. శుక్రవారం రాత్రి సమయంలో దొంగలు ఆలయం లోపలికి వెళ్లి, ఇనుప చువ్వలతో ఏర్పాటు చేసిన గేట్లను ధ్వంసం చేసి దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పక్కాగా రెక్కీ నిర్వహించి స్థానికేతరులు […]</p>

దిశ, మునుగోడు : చౌటుప్పల్ మండల పరిధిలోని పీపల్ పహాడ్ గ్రామంలో గల రంగనాథస్వామి ఆలయంలో జరిగింది. ఈ చోరీ విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పీపల్ పహాడ్ గ్రామంలోని రంగనాథస్వామి ఆలయంలో మూడు హుండీలను పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. శుక్రవారం రాత్రి సమయంలో దొంగలు ఆలయం లోపలికి వెళ్లి, ఇనుప చువ్వలతో ఏర్పాటు చేసిన గేట్లను ధ్వంసం చేసి దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పక్కాగా రెక్కీ నిర్వహించి స్థానికేతరులు ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గత రెండు సంవత్సరాలుగా ఈ హుండీలలోని నగదును లెక్కించలేదు. ఇక్కడ ప్రతి సంవత్సరం భారీ ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తూ ఉండడంతో సుమారుగా రెండు లక్షలకు పైగానే నగదు ఉండవచ్చని స్థానికులు అంచనా వేస్తున్నారు. ఇటీవలే ఈ ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖలోకి చేర్చారు. సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంను రప్పించి విచారణ నిర్వహిస్తున్నారు.






