ఇంట్లో మీ పెద్దవాళ్ల పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నారా..? అయితే జాగ్రత్త..

by Batti.Sumithra |   (  Updated:2021-08-09 11:40:47  IST  )

<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి పోలీస్ లు అరుదైన కేసును చెందించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నెల 5న డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్ శివారులో జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు చేధించారు. మిట్టపల్లికి చెందిన వృద్ధురాలి హత్య తీగను లాగితే డొంక కదిలినట్టు ఒక హత్య కేసులో ఒక వ్యక్తిని విచారిస్తే ఆ హత్య తోపాటు మరో రెండు హత్యలు చేసినట్టు ఒప్పుకున్నట్టు తెలిసింది. 2020 నుంచి ఇప్పటి వరకు ముగ్గరిని [&hellip;]</p>

ఇంట్లో మీ పెద్దవాళ్ల పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నారా..? అయితే జాగ్రత్త..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి పోలీస్ లు అరుదైన కేసును చెందించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నెల 5న డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్ శివారులో జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు చేధించారు. మిట్టపల్లికి చెందిన వృద్ధురాలి హత్య తీగను లాగితే డొంక కదిలినట్టు ఒక హత్య కేసులో ఒక వ్యక్తిని విచారిస్తే ఆ హత్య తోపాటు మరో రెండు హత్యలు చేసినట్టు ఒప్పుకున్నట్టు తెలిసింది. 2020 నుంచి ఇప్పటి వరకు ముగ్గరిని హత్యలు చేయడం దానికి కారణం బాధితుల వద్ద ఉన్న డబ్బుల కోసం కావడం గమనార్హం.

నిందితుడు కమలపూర్‌కు చెందినవాడు కాగా రైల్వే స్టేషన్ ఆవరణలో ఉంటూ ఎవ్వరికీ అనుమానం రాకుండా 2020 ఫిబ్రవరి లో సల్మాన్ ఖాన్, 2021 ఫిబ్రవరి లో మోసిన్ అను వ్యక్తులను కల్లు బట్టి వద్ద కల్లు సేవించిన వారిని శివారులో ప్రాంతంలో రైల్వే ట్రాక్ సమీపంలో మట్టు బెట్టాడు. సదరు వ్యక్తి కేవలం కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం చేసిన వారిని టార్గెట్ చేసి వారి వద్ద ఉన్న చిన్న మొత్తం కోసం హత్యలు చేసినట్టు తెలిసింది. సోమవారం పోలీస్‌లు వేర్వేరు సమయాల్లో మూడు హత్యలు జరిగిన ప్రాంతాల్లో హతుల వివరాలతో పరిశీలన చేసారు. సీపీ కార్తికేయ ఆధ్వర్యంలో అధికారులు నిందితుడిని పూర్తి స్థాయిలో విచారణ జరిపినట్టు తెలిసింది. రేపో మాపో మూడు హత్యలు కేసు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

Next Story