బ్రేకింగ్ న్యూస్: ప్రమాదకరంగా మారిన డబిర్ పురా వంతెన

29
Road-Problem1

దిశ, చార్మినార్: ముసారాం బాగ్ వంతెన పగుళ్లు ఏర్పడిన ఘటన మరువక ముందే ఇటీవల నిర్మించిన పాతబస్తీ డబిర్ పురా వంతెనపై పెద్ద గొయ్యి ఏర్పడి అత్యంత ప్రమాదకరంగా మారింది. డబిర్ పురా వంతెనపై భారీ వాహనాలు రాకపోకలు సాగించడం, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిని గొయ్యి ఏర్పడింది. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు డబిర్ పురా వంతెనపై గొయ్యి ఏర్పడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతంలో రాకపోకలకు నిషేధం విధిస్తూ సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. కానీ, సంబంధిత కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం కారణంగానే వంతెనపై గొయ్యి ఏర్పడిందని పలువురు ఆరోపిస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..