- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏ జన్మ రుణమో ఇది.. బామ్మ కౌగిలిలో సేద తీరుతున్న కొండెగ
<p>దిశ, వెబ్‌డెస్క్ : కరోనా లాంటి విపత్కర సమయంలో మనుషులను మనుషులే పట్టించుకోని ఈ రోజుల్లో ఓ కొండెంగ బామ్మపై చూపిన ప్రేమ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. భూమిపై ఇంకా ప్రేమానురాగాలు మిగిలి ఉన్నాయని అనేలా ఉంది వారిద్దరి ప్రేమానురాగం. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లోని ఫలోడి అనే గ్రామంలో వింత ఘటన చోటు చేసుకుంది. భన్‌వ్రీ దేవి అనే వృద్ధురాలు కొన్ని నెలల నుంచి మంచానికే పరిమితమై ఉంది. ఈ క్రమంలో తాను పడుకొని ఉన్న దగ్గరి ఎక్కడి […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా లాంటి విపత్కర సమయంలో మనుషులను మనుషులే పట్టించుకోని ఈ రోజుల్లో ఓ కొండెంగ బామ్మపై చూపిన ప్రేమ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. భూమిపై ఇంకా ప్రేమానురాగాలు మిగిలి ఉన్నాయని అనేలా ఉంది వారిద్దరి ప్రేమానురాగం. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లోని ఫలోడి అనే గ్రామంలో వింత ఘటన చోటు చేసుకుంది. భన్‌వ్రీ దేవి అనే వృద్ధురాలు కొన్ని నెలల నుంచి మంచానికే పరిమితమై ఉంది.
ఈ క్రమంలో తాను పడుకొని ఉన్న దగ్గరి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఓ కొండెంగా బామ్మదగ్గరకు వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. బామ్మ పడుకున్న మంచం దగ్గరకు వచ్చి, బామ్మ పై కూర్చొని బామ్మ తలను ఆప్యాయంగా నిమిరింది. దీంతో బామ్మ కూడా కొండెంగ వీపు మీద ప్రేమగా నిమిరింది. అంతటితో ఆగకుండా ఆ కొండెంగా బామ్మను ఆలిగనం చేసుకుంటూ ముద్దు పెట్టుకుంది. దీంతో ఆ కుటుంబసభ్యులు షాక్‌కుగురయ్యారు. ఆ భగవంతుడే కొండెంగ రూపంలో బామ్మదగ్గరకు వచ్చారని సంతోష పడ్డారు.






