డిజిటల్ వార్.. ప్రచారంలో అభ్యర్థుల జోరు

by  |
డిజిటల్ వార్.. ప్రచారంలో అభ్యర్థుల జోరు
X

దిశ ప్రతినిధి , హైద‌రాబాద్: సోషల్‌ మీడియా వేదికగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఫేస్ బుక్,వాట్సాప్,ట్వీటర్ల ఇలా ఒక్కటేమిటీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అన్నింటిని ప్రచారానికి వాడుకుంటున్నారు. అభ్యర్థుల వీడియో, ఆడియో క్లిప్పింగ్స్‌ ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తు న్నాయి. పోస్టింగ్ లో ఒకరిని మించి మరొకరు దూసుకపోతున్నారు. వేలాది మందికి ఒక్క క్లిక్ తో చేరుతుండటంతో ప్రధాన పార్టీలన్నీ సోషల్ మీడియా బాట పడుతున్నాయి. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ – రంగారెడ్డి- హై ద‌రాబాద్ ప‌ట్టభ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌ల్లో గెలుపు కోసం అభ్యర్థులు స‌ర్వశ‌క్తులు ఒడ్డుతున్నారు. ఇందులో భాగంగా ఓట‌ర్లను ప్రస‌న్నం చేసుకునేందుకు అందుబాటులో ఉన్న వ‌నరులన్నీ వినియోగిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచార హోరు కొన‌సాగిస్తూ ఓట‌రును ప్రస‌న్నం చేసుకునే ప్రయ‌త్నంలో ఉన్నారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు సాధార‌ణ ఎన్నిక‌ల వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల బ‌రిలో నిల్చున్న అభ్యర్థులు సోష‌ల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం సాగిస్తున్నారు.

ముఖ్యంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న వాట్సాప్ మెసేజ్ ల‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు . ఫేస్ బుక్, ట్వీటర్ లను కూడా విరి విగా వాడుతున్నారు. అంతేకాకుండా గ్రాడ్యుయేట్ అభ్యర్థులతో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆన్‌లై న్‌లోనూ జోరుగా ప్రచారం నడిపిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఓటర్లకు విజ్ఞప్తులు పంపిస్తున్నారు. అభ్యర్థుల‌కు పంపే మెసేజ్ లో సీరియ‌ల్ నెంబర్ , ఓట‌రు పేరు , తండ్రి పేరు , వ‌య‌స్సు,జెండ‌ర్ , ఎపిక్ నెంబ‌ర్ , పోలింగ్ స్టేష‌న్ పార్ట్ నెంబర్ , పేరు , పోలింగ్ స్టేష‌న్ అడ్రస్ త‌దిత‌ర వివ‌రాలు పొంది ప‌ర్చి ఓటు వేయాల‌ని అభ్య‌ర్థిస్తున్నారు.

టీఆర్ఎస్ అభ్యర్థి ఓ ఓట‌రుకు పంపిన స‌మాచారం…మ‌హ‌బూబ్ న‌గ‌ర్- రంగా రెడ్డి – హైద‌రాబాద్ ప‌ట్టభ‌ద్రుల నియో జ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగిన అభ్యర్థిని ,మాజీ ప్రధాని పీవీ కూతురు త‌న‌కు ఓటు వేయాల‌ని ఓ ఓటరుకు పంపిన స‌మాచారం ఇలా ఉంది.

డీఆర్సీసెంట‌ర్గా ఎల్బీ స్టేడియం…

మ‌హ‌బూబ్ న‌గ‌ర్- రంగారెడ్డి – హైద‌రాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ సామాగ్రి పంపిణీకి ఎల్బీ స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నిక‌ల రోజున ఇక్కడి నుంచే బ్యాలెట్ బాక్స్ లను తీసుకెళ్లాల్సి ఉంటుంది. నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 5,21,386 మంది ఓట‌ర్లు ఉండ‌గా వీరిలో 3,29,888 మంది పురుషులు , 1,91,430 మంది మ‌హిళ‌లు, 68 మంది ట్రాన్స్ జెండ‌ర్లు ఉన్నారు. మొత్తం 616 పోలింగ్ స్టేష‌న్లు ఉన్నాయి.వీటిల్లో 163 పోలింగ్ స్టేష‌న్లలో వెయ్యికి పైగా ఓట‌ర్లు ఉండ‌డంతో వీటికి అనుబంధంగా పోలింగ్ స్టేష‌న్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు .

Next Story

Most Viewed