గ్రాడ్యుయేట్ MLC ఎన్నికపై ఈటల కీలక వ్యాఖ్యలు

by GSrikanth |
గ్రాడ్యుయేట్ MLC ఎన్నికపై ఈటల కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వానికి తెలంగాణ యువత కూడా ఆకర్షితులు అయ్యారని అన్నారు. పట్టభద్రులు కూడా మోడీవైపే చూస్తున్నారని చెప్పారు. గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయంగా కనిపిస్తోందని అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా కాంగ్రెస్ ప్రభుత్వంపై అతి తక్కువ సమయంలోనే వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. అమలుకు సాధ్యం కానీ హామీలు గుప్పించి కాంగ్రెస్ దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీతో పాటు నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలోనూ సత్తా చాటబోతున్నట్లు తెలిపారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి ఘన విజయం సాధిస్తారని అన్నారు. మొత్తంగా రాష్ట్రంలో 12 సీట్లు, దేశ వ్యాప్తంగా 400 వరకు బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed