టీ, సిగరెట్ కలిపి తాగేవారు.. వీటి గురించి తప్పక తెలుసుకోవాలి

by Prasanna |
టీ, సిగరెట్ కలిపి తాగేవారు.. వీటి గురించి తప్పక తెలుసుకోవాలి
X

దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో టీ తాగుతూ సిగరెట్ తాగడం యువతకు హాబీగా మారిపోయింది. ఏ టీ షాప్ దగ్గరైన యువకులు టీ తాగడం సిగరెట్లు తాగడం మీరు తరచుగా చూస్తుంటారు. చాలా మంది టీనేజర్లు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇలా చేస్తుంటారు. నిజానికి రోజూ టీ, సిగరెట్లు తీసుకోవడం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. యువతలో దీర్ఘకాలిక వ్యాధులకు ఇవి కూడా ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు.

టీ, సిగరెట్లను కలిపి తీసుకుంటే క్యాన్సర్ ముప్పు 30 శాతానికి పైగా పెరుగుతుందని ఇటీవలి కొన్ని నివేదికలు వెల్లడించాయి. టీలో కెఫిన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, సిగరెట్ తాగుతూ టీ తాగడం వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ రెండు డ్రింక్స్ కలిపి తాగడం వల్ల లాభదాయకమే అయినప్పటికీ భవిష్యత్తులో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, టీలో కెఫీన్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది కడుపులో యాసిడ్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఖాళీ కడుపుతో టీ, సిగరెట్లు ఒకేసారి తాగడం వల్ల తలనొప్పి, తల తిరగడం, కడుపు క్యాన్సర్, కాలి మీద పుండ్లు, గుండెపోటు ప్రమాదం వరకు సమస్యలు వస్తాయి. అందువల్ల, మీరు దీన్ని తరచుగా చేస్తుంటే, వెంటనే దానిని నివారించాలి.

Next Story