- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లంక పే పేరుతో శ్రీలంకలో ప్రారంభమైన ఫోన్ పే సేవలు
దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో యూపీఐ లావాదేవీల సంస్థ ఫోన్ పే శ్రీలంకలో తన సేవలను ప్రారంభించింది. గతంలో భారత్ కు చెందిన యూపీఐ సేవలను ప్రపంచం మొత్తం అందుబాటులోకి తెస్తామని.. ముఖ్యంగా టూరిజం పై ఆదారపడిన దేశాల్లో దీని అవసరం చాలా ఉంటుందని.. పర్యాటకులకు కూడా సులభతర సేవలు అందుబాటులోకి వస్తాయని భారత అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. తాజాగా.. ఫోన్ పే సేవలను అధికారికంగా శ్రీలంకలో ప్రారంభించినట్లు శ్రీలంకలోని భారత హైకమిషన్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ యూపీఐ సేవలు అందుబాటులోకి రావడం వల్ల శ్రీలంకకు అధికంగా పర్యటనకు వెళ్లే భారతీయులకు మరింత సౌలభ్యాన్ని కల్పిస్తుందని తెలిపింది. కాగా దీనిని ఆ దేశంలో లంకా పే తో కలిపి తాము ఆపరేట్ చేస్తున్నట్లు ఫోన్ పే ప్రకటించింది. అలాగే భారతీయ పర్యాటకులు తమ ఫోన్ పే ద్వారా లంకా పే క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయవచ్చని.. పర్యటకులు తమ వెంట నగదును తీసుకెళ్లాల్సిన అవసరం లేదని వారు పేర్కొన్నారు.