- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాడు అదృశ్యమై.. నేడు అస్థిపంజరంగా
by Batti.Sumithra |
<p>దిశ,పాలేరు: గత నెల క్రితం అదృశ్యమైన వ్యక్తి అస్థిపంజరం లభించిన సంఘటన తిరుమలాయపాలెం మండల పరిధిలోని పిండిప్రోలులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం…పిండిప్రోలు గ్రామానికి చెందిన దొండేటి రామకృష్ణ(38)అనే వ్యక్తి ఏప్రిల్ లో ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కాగా..ఆదివారం గ్రామ సమీపంలోని ఓ క్వారీలో అస్తిపంజరం కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమచారం అందించారు. క్వారీలో అస్థిపంజరానికి ఉన్న చెప్పులు, దుస్తుల ఆధారంగా రామకృష్ణ కుటుంబ సభ్యులు గుర్తించారు. అయితే అస్థిపంజరం సమీపంలో పురుగులమందు డబ్బా […]</p>

X
దిశ,పాలేరు: గత నెల క్రితం అదృశ్యమైన వ్యక్తి అస్థిపంజరం లభించిన సంఘటన తిరుమలాయపాలెం మండల పరిధిలోని పిండిప్రోలులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం…పిండిప్రోలు గ్రామానికి చెందిన దొండేటి రామకృష్ణ(38)అనే వ్యక్తి ఏప్రిల్ లో ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కాగా..ఆదివారం గ్రామ సమీపంలోని ఓ క్వారీలో అస్తిపంజరం కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమచారం అందించారు. క్వారీలో అస్థిపంజరానికి ఉన్న చెప్పులు, దుస్తుల ఆధారంగా రామకృష్ణ కుటుంబ సభ్యులు గుర్తించారు. అయితే అస్థిపంజరం సమీపంలో పురుగులమందు డబ్బా ఉంది. దీనితో పురుగులమందు తాగి అతను ఆత్మహత్య చేసుకుని ఉన్నట్లు భావిస్తున్నారు. మృతుడి భార్య, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రఘు తెలిపారు.
Next Story






