- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇక అప్పుడే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ :మంత్రి తలసాని
<p>దిశ, బేగంపేట్: సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేటలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను డిసెంబర్ మొదటి వారంలో అందజేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. సోమవారం బన్సీలాల్ పేటలోని బండ మైసమ్మ నగర్, CC నగర్ లలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బండ మైసమ్మ నగర్‌లో 310 గృహాల ప్రవేశం డిసెంబర్ 5వ తేదీన, CC […]</p>

X
దిశ, బేగంపేట్: సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేటలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను డిసెంబర్ మొదటి వారంలో అందజేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. సోమవారం బన్సీలాల్ పేటలోని బండ మైసమ్మ నగర్, CC నగర్ లలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బండ మైసమ్మ నగర్‌లో 310 గృహాల ప్రవేశం డిసెంబర్ 5వ తేదీన, CC నగర్‌లో 240 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ డిసెంబర్ 8న పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత లక్ష్మీపతి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డిఓ వసంత, హౌసింగ్ ఈఈ వెంకట్ దాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Next Story






