- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
20 నెలల తర్వాత గుర్తొచ్చిన అడ్రస్
<p>దిశ, విశాఖపట్నం: విశాఖ మానసిక ఆసుపత్రిలో 20 నెలలుగా మతిస్థిమితం లేని కారణంగా చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి ఎట్టకేలకు తన ఇంటి చిరునామా గుర్తొచ్చింది. దీనిపై విశాఖ మానసిక ఆస్పత్రి డాక్డర్ రామానంద శతపతి వివరాల ప్రకారం… గతకొన్ని రోజుల క్రితం మధ్యప్రదేశ్‌కు చెందిన సురేంద్రకుమార్(22), నగరంలోని చినవాల్తేరు రోడ్డుపై మతిస్థిమితం లేకుండా ఉండటాన్ని గుర్తించి ఆస్పత్రిలో చేర్పించామన్నారు. అంతేగకాకుండా అతనికి 20 నెలలుగా చికిత్స అందిస్తున్నామని తెలిపారు. అయితే సురేంద్రకు అందించిన చికిత్స మూలంగా […]</p>

X
దిశ, విశాఖపట్నం: విశాఖ మానసిక ఆసుపత్రిలో 20 నెలలుగా మతిస్థిమితం లేని కారణంగా చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి ఎట్టకేలకు తన ఇంటి చిరునామా గుర్తొచ్చింది. దీనిపై విశాఖ మానసిక ఆస్పత్రి డాక్డర్ రామానంద శతపతి వివరాల ప్రకారం… గతకొన్ని రోజుల క్రితం మధ్యప్రదేశ్‌కు చెందిన సురేంద్రకుమార్(22), నగరంలోని చినవాల్తేరు రోడ్డుపై మతిస్థిమితం లేకుండా ఉండటాన్ని గుర్తించి ఆస్పత్రిలో చేర్పించామన్నారు. అంతేగకాకుండా అతనికి 20 నెలలుగా చికిత్స అందిస్తున్నామని తెలిపారు. అయితే సురేంద్రకు అందించిన చికిత్స మూలంగా ఆయన కొంతమేర కోలుకుని, ఎట్టకేలకు తన ఇంటి చిరునామా గుర్తొచ్చిందని వెల్లడించారు. దీంతో జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ సాయంతో సురేంద్రని తన ఇంటికి చేర్చుతున్నామని, ఈ మేరకు జిల్లా పోలీసులు మధ్యప్రదేశ్ పోలీసులను సంప్రదించడంతో డిశార్చి చేస్తున్నామన్నారు.
Next Story






