నవంబర్ వరకు మీడియా భవనం పూర్తిచేయాలి : అల్లం

by  |
Allam Narayana
X

దిశ, తెలంగాణ బ్యూరో : మీడియా అకాడమి భవనాన్ని నవంబర్ వరకు పూర్తి చేయాలని తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ కాంట్రాక్టర్, రోడ్లు భవనాలశాఖ ఇంజనీర్లకు సూచించారు. బుధవారం హైదరాబాద్ నాంపల్లిలో మీడియా అకాడమి భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం సంబంధిత కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా అకాడమి నూతన భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి నవంబర్ వరకు జర్నలిస్టులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

మీడియా అకాడమి భవనాన్ని బహుళ అంతస్తుల భవనంగా నిర్మిస్తున్నామని, 200 మందికి సరిపడేలా ఆడిటోరియంను నిర్మిస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టులకు శిక్షణా తరగతులు, సర్టిఫికేట్ కోర్సుల నిర్వహణ, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, వీడియా కాన్ఫరెన్స్ తోపాటు ఆధునిక సౌకర్యాలతో కూడిన ఆడిటోరియంను నిర్మిస్తున్నామని వెల్లడించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో మీడియా అకాడమి కార్యదర్శి ఎండీ ముర్తుజా, కాంట్రాక్టర్ నర్రా శ్రీనివాస్, రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నర్సింగరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాధవి, అసిస్టెంట్ ఇంజనీర్ నితిన్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed