- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారోత్సవాల వేళ.. మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ
by Sridhar Babu |
<p>దిశ, భద్రాచలం: 17వ వార్షికోత్సవం వేళ సీపీఐ(మావోయిస్టు) పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కేర్లపాల్ ఎల్‌వోఎస్ కమాండర్ మడకం అయితా, అతని భార్య, డిప్యూటీ కమాండర్ పొజ్జే మంగళవారం సుక్మా ఎస్పీ సునీల్ శర్మ ఎదుట లొంగిపోయారు. అయితాపై రూ.5 లక్షలు, పొజ్జేపై రూ.2 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. ఈ నక్సలైట్ దంపతులు పలుమార్లు ఎల్‌ఈడీ బాంబ్ బ్లాస్టింగ్, పోలీసులపై కాల్పులు, ఆరోగ్య కేంద్రం ధ్వంసం వంటి ప్రధాన ఘటనలకు […]</p>

X
దిశ, భద్రాచలం: 17వ వార్షికోత్సవం వేళ సీపీఐ(మావోయిస్టు) పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కేర్లపాల్ ఎల్‌వోఎస్ కమాండర్ మడకం అయితా, అతని భార్య, డిప్యూటీ కమాండర్ పొజ్జే మంగళవారం సుక్మా ఎస్పీ సునీల్ శర్మ ఎదుట లొంగిపోయారు. అయితాపై రూ.5 లక్షలు, పొజ్జేపై రూ.2 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. ఈ నక్సలైట్ దంపతులు పలుమార్లు ఎల్‌ఈడీ బాంబ్ బ్లాస్టింగ్, పోలీసులపై కాల్పులు, ఆరోగ్య కేంద్రం ధ్వంసం వంటి ప్రధాన ఘటనలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన వీరికి, ఇప్పటికే వారిపై ప్రకటించిన రివార్డును ప్రభుత్వ తరపున అందజేశారు. ఇదే మాదిరి మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోయి ప్రజల్లో స్వేచ్ఛగా జీవించాలని ఎస్పీ సునీల్ శర్మ విజ్ఞప్తి చేశారు.
Next Story






