- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రేమికుల ప్రాణం తీసిన సెల్ఫీ
<p>దిశ, వెబ్ డెస్క్ : సరదాగా గడుపుదాం అని వెళ్లిన ప్రేమ జంట ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బీదర్ లోని కర్ణాటక కాలేజీలో బీఏ చదువుతున్న పురుణషోత్తం పాటిల్.. గుల్బర్గాలో ఇంజనీరింగ్ చదువుతున్న తన ప్రియురాలు ఇద్దరు కలసి కాలక్షేపం కోసం విహారయాత్రకు వెళ్లారు. అయితే ఆటోలో దాండేలి నుండి జోయిడా వద్ద అంబికానగర గణేశ గుడి సమీపంలోని వంతెన వద్దకు వచ్చారు. అక్కడ ఎవరు లేని సమయంలో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : సరదాగా గడుపుదాం అని వెళ్లిన ప్రేమ జంట ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బీదర్ లోని కర్ణాటక కాలేజీలో బీఏ చదువుతున్న పురుణషోత్తం పాటిల్.. గుల్బర్గాలో ఇంజనీరింగ్ చదువుతున్న తన ప్రియురాలు ఇద్దరు కలసి కాలక్షేపం కోసం విహారయాత్రకు వెళ్లారు. అయితే ఆటోలో దాండేలి నుండి జోయిడా వద్ద అంబికానగర గణేశ గుడి సమీపంలోని వంతెన వద్దకు వచ్చారు. అక్కడ ఎవరు లేని సమయంలో తమ ఫోన్ లో సెల్ఫీ తీసుకుంటుండగా జారీ నదిలో పడిపోయారు. మంగళ వారం ఉదయం రెండు మృతదేహాలు కనిపించడంతో అక్కడ ఉన్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని వీరు ప్రమాద వశాత్తు పడ్డారా లేక ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో విచారణ చేపట్టారు.
Next Story






