పసిపాప పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అధికార పార్టీ నాయకుడు

by  |
Rape-1
X

దిశ, ములకలపల్లి: అభం శుభం తెలియని ఆడపిల్లల పట్ల అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆ పసిపాపతో ప్రవర్తించాడు. ఆ పాపతో ఉన్న తోటి పిల్లలు గమనించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో చోటుచేసుకుంది.

స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నర్సాపురం గ్రామానికి చెందిన బాలిక తన స్నేహితులతో కలిసి ఆడుకుంటోంది. అయితే అదే గ్రామానికి చెందిన మాదిబోయిన సత్యనారాయణ (సత్యం బాబు) మాయ మాటలు చెప్పి ఆ బాలికలను పక్కకు తీసుకపోయి వారిలో ఒక బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడు సత్యంబాబును స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి వారిపట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు.

నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం- ఎస్సై సురేష్
బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు నర్సాపురం గ్రామానికి చెందిన మాదిబోయిన సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నాం. ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం అందించి నిందితుడిని విచారిస్తున్నాం.

Next Story

Most Viewed