- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలోనే అతిపెద్ద వేడుకకు వేదిక కాబోతున్న హైదరాబాద్..
<p>దిశ, శేరిలింగంపల్లి: భారతదేశంలోనే అతిపెద్ద కిడ్స్ ఫెయిర్-2021, 14వ ఎడిషన్‌కు హైదరాబాద్‌లోని హైటెక్స్ మాదాపూర్ వేదిక కానుంది. రెండు సంవత్సరాల విరామం తర్వాత ఈనెల 24 నుండి 26 వరకు హైటెక్స్‌లో కిడ్స్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ కిడ్స్ ఫెయిర్‌లో నగరం నుండే కాకుండా భారతదేశం నలుమూలల నుండి 150 మందికి పైగా ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. హైదరాబాద్ కిడ్స్ ఫెయిర్ 2021లో పిల్లలను నిమగ్నం చేయడానికి అనేక ఆసక్తికరమైన కొత్త ఉత్పత్తులను […]</p>

దిశ, శేరిలింగంపల్లి: భారతదేశంలోనే అతిపెద్ద కిడ్స్ ఫెయిర్-2021, 14వ ఎడిషన్‌కు హైదరాబాద్‌లోని హైటెక్స్ మాదాపూర్ వేదిక కానుంది. రెండు సంవత్సరాల విరామం తర్వాత ఈనెల 24 నుండి 26 వరకు హైటెక్స్‌లో కిడ్స్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ కిడ్స్ ఫెయిర్‌లో నగరం నుండే కాకుండా భారతదేశం నలుమూలల నుండి 150 మందికి పైగా ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. హైదరాబాద్ కిడ్స్ ఫెయిర్ 2021లో పిల్లలను నిమగ్నం చేయడానికి అనేక ఆసక్తికరమైన కొత్త ఉత్పత్తులను అందజేస్తుందని హైటెక్స్ బిజినెస్ హెడ్ శ్రీకాంత్ అన్నారు. కిడ్స్ ఫెయిర్‌లో ఎంటర్టైన్మెంట్, గేమ్స్, నాలెడ్జ్, హెల్త్ అండ్ న్యూట్రిషన్ అనే ఐదు అంశాలుంటాయన్నారు.
ఫాబీ బేబీ దుబాయ్ ఆధారిత బ్రాండ్ వ్యవస్థాపకుడు అండ్ సీఈఓ మనోజ్ కంకనే మాట్లాడుతూ.. దుబాయ్ బంగారం స్వచ్ఛతకు ప్రసిద్ధి చెందినట్లే మా ఫ్యాబులస్ బేబీ (ఫేబీ బేబీ) ఉత్పత్తుల శ్రేణి స్వచ్ఛత, నాణ్యతకు ప్రసిద్ధి చెందిందన్నారు. ఇది భారతదేశంలో మొట్టమొదటి దుబాయ్ ఆధారిత బ్రాండ్ అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గిగ్లెమగ్ వ్యవస్థాపకురాలు స్వాతి వాసురెడ్డి, కాబ్రా గ్లోబల్ ప్రొడక్ట్స్ సహ వ్యవస్థాపకుడు రవి కాబ్రా, డాక్టర్ రవికిరణ్, మై ప్రింట్స్ ప్రతినిధి శైలజా శెట్టి, శుభమ్ జైన్, షుషు బేబీస్ సులక్షణ తదితరులు పాల్గొన్నారు.






