- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా కాటుకు బలైన మరో జర్నలిస్టు
<p>దిశ, నాగార్జునసాగర్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మరీ ముఖ్యంగా జర్నలిస్టులపై పంజా విసురుతోంది. రోజూ అనేకమంది జర్నలిస్టులు మహమ్మారి బారినపడుతుండగా పరిస్థితి విషమించి పలువులు మృతిచెందుతున్నారు. తాజాగా.. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ టీవీ9 జర్నలిస్టు గోపిని బలి తీసుకుంది. ఇటీవల కరోనా బారినపడిన ఆవుల గోపి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. దీంతో నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వర్గాల్లో […]</p>

దిశ, నాగార్జునసాగర్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మరీ ముఖ్యంగా జర్నలిస్టులపై పంజా విసురుతోంది. రోజూ అనేకమంది జర్నలిస్టులు మహమ్మారి బారినపడుతుండగా పరిస్థితి విషమించి పలువులు మృతిచెందుతున్నారు. తాజాగా.. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ టీవీ9 జర్నలిస్టు గోపిని బలి తీసుకుంది. ఇటీవల కరోనా బారినపడిన ఆవుల గోపి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. దీంతో నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వర్గాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.
కాగా, కరోనా సెకండ్ వేవ్‌లో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలువురు జర్నలిస్టులు మృతిచెందగా మరో జర్నలిస్టు మృతి మీడియా వర్గాల్లో కలకలం రేపుతోంది. కరోనా మహామ్మారిని ఎదుర్కొనేందుకు ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా కొనసాగుతున్న వారిలో మరణాలు సంభవిస్తుండటం ఆందోళన కల్గిస్తున్న అంశంగా మారింది.






