జాతి వివక్ష ఘటనపై ఐసీసీ సీరియస్

by  |
జాతి వివక్ష ఘటనపై ఐసీసీ సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: సిడ్ని వేదికగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్-భారత్ మధ్య మూడో టెస్టు మ్యాచ్ సిడ్నీలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆసిస్ క్రీడాభిమానులు మరోసారి నోరు పారేసుకున్నారు. భారత ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ మూడో రోజు కూడా జాతివివక్ష వ్యాఖ్యలు చేశారు. దీంతో స్పందించిన ఇంటర్నేషనల్ క్రికెట్ బోర్డు(ఐసీసీ) ఆస్ట్రేలియాను వివరణ కోరింది. క్రీడాకారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆసిస్ క్రీడాభిమానుల పట్ల ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని కోరింది. కాగా, గత రెండు రోజులుగా ఆసీస్ ఫ్యాన్స్ టీమిండియా ఆటగాళ్లు జస్ప్రిత్ బూమ్రా, మహ్మద్ సిరాజ్‌లు జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని టీమిండియా ప్లేయర్లు కెప్టెన్‌ రహానేకు ఫిర్యాదు చేయగా.. రహానే అంపైర్ల దృష్టికి తీసుకెళ్లారు. అంపైర్లు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని బయటకు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed