పక్కింటి వ్యక్తితో బెడ్‌రూమ్‌లో భార్య.. భర్త సడెన్ ఎంట్రీ.. ఏం జరిగిందంటే..

by  |
పక్కింటి వ్యక్తితో బెడ్‌రూమ్‌లో భార్య.. భర్త సడెన్ ఎంట్రీ.. ఏం జరిగిందంటే..
X

దిశ, వెబ్‌డెస్క్ : వివాహేతర సంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. అక్రమ సంబంధాల కారణంగా దారుణ హత్యలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా వివాహేతర సంబంధం కారణంగా భార్యను, ఓ భర్త బండరాయితో మోది హత్య చేశాడు. అనంతరం పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. వివరాల ప్రకారం.. కర్ణాటకలోని హోసూరు తాలూకాలో చెన్నబసప్ప(44), గౌరమ్మ (40) దంపతులు నివాసం ఉంటున్నారు. గౌరమ్మకు పక్కింటి వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని తెలియడంతో చెన్నబనప్ప.. ఆమెను మందలించాడు. చిన్నబనప్ప మాటలను ఆమె పట్టించుకోలేదు.

ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఆమె.. ప్రియుడితో సన్నిహితంగా ఉండటం చెన్నబసప్ప చూసాడు. దీంతో ఆగ్రహానికి లోనైనా అతడు.. భార్యను హతమార్చాలని అనుకున్నాడు. గౌరమ్మను బయటకు వెళదాం అని చెప్పి.. అర్ధరాత్రి సమయంలో భార్యను వేపనపల్లి సమీపంలోని కే.ఎన్‌.పోడూరు బసవేశ్వరస్వామి ఆలయం వద్దకు తీసుకెళ్లి తలపై బండరాయితో బాది హత్య చేశాడు. అనంతరం.. హోసూరు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు గౌరమ్మ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.


Next Story