- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్య కాపురానికి రాదేమోనని…
<p>దిశ, జగిత్యాల: జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం వల్లంపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మహేష్(23) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నెల రోజుల క్రితం మండలంలోని బీమారం గ్రామానికి చెందిన గుండేటి శృతిని ప్రేమ వివాహం చేసుకున్న మహేష్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. రాఖీ పౌర్ణమికి పుట్టింటికి వెళ్లిన భార్య కాపురానికి రాదేమోనని కలత చెంది ఆత్మహత్యకు పాల్పడట్టు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే మహేష్ […]</p>

X
దిశ, జగిత్యాల: జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం వల్లంపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మహేష్(23) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నెల రోజుల క్రితం మండలంలోని బీమారం గ్రామానికి చెందిన గుండేటి శృతిని ప్రేమ వివాహం చేసుకున్న మహేష్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. రాఖీ పౌర్ణమికి పుట్టింటికి వెళ్లిన భార్య కాపురానికి రాదేమోనని కలత చెంది ఆత్మహత్యకు పాల్పడట్టు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే మహేష్ ఆత్యహత్య చేసుకున్న విషయం తెలిసిన శృతి కూడా కొద్దిసేపటి క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. విషయం పోలీసులు తెలసుకున్న కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Next Story






