అతనితో శ్రీవారిని దర్శించుకున్న నయనతార.. అతను ఎవరు ?

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో: హీరోయిన్ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ తిరుమలలో సందడి చేశారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని శిఘ్నేశ్ శివన్‌తో కలిసి నయనతార దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ఇరువురూ మెుక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలను అందజేశారు. నయనతార శ్రీవారిని దర్శించుకుని బయటకు వచ్చినప్పుడు ఆమెను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. మరికొందరైతే సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. ఇకపోతే నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ ప్రేమలో [&hellip;]</p>

అతనితో శ్రీవారిని దర్శించుకున్న నయనతార.. అతను ఎవరు ?
X

దిశ, ఏపీ బ్యూరో: హీరోయిన్ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ తిరుమలలో సందడి చేశారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని శిఘ్నేశ్ శివన్‌తో కలిసి నయనతార దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ఇరువురూ మెుక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలను అందజేశారు. నయనతార శ్రీవారిని దర్శించుకుని బయటకు వచ్చినప్పుడు ఆమెను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. మరికొందరైతే సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. ఇకపోతే నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇలాంటి తరుణంలో ఇద్దరూ కలిసి స్వామివారిని దర్శించుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే హీరోయిన్ నయనతార ప్రస్తుతం లయన్, పట్టు, ఆటో జానీ, త్రిష్ణ, గోల్డ్ సినిమాల్లో నటిస్తోంది.

Next Story