‘ది గ్రే మ్యాన్’లో ధనుష్ క్యారెక్టర్ అదే!

by  |
‘ది గ్రే మ్యాన్’లో ధనుష్ క్యారెక్టర్ అదే!
X

దిశ, సినిమా : కోలీవుడ్ హీరో ధనుష్ సెకండ్ హాలీవుడ్ ప్రాజెక్ట్ ‘ది గ్రే మ్యాన్’ షూటింగ్ కోసం లాస్ ఏంజిల్స్ వెళ్లిన విషయం తెలిసిందే. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానుండగా.. ఈ కోలీవుడ్ స్టార్ అందుకు సంబంధించిన ప్రిపరేషన్స్‌లో ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ గురించి ఇప్పటికే కొన్ని డీటెయిల్స్ బయటకు వచ్చినా.. ఈ సినిమాలో ధనుష్ ఏ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడనే విషయం మాత్రం ఇంత వరకు తెలియలేదు. దీని గురించి తెలుసుకునేందుకు అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. కాగా రుస్సో బ్రదర్స్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా.. మార్క్ గ్రీని రచించిన ‘ది గ్రే మ్యాన్’ నవల ఆధారంగా తెరకెక్కుతుండగా.. తన ఆన్‌లైన్ ఇంటరాక్షన్‌లో ధనుష్ క్యారెక్టర్‌ను రివీల్ చేశారు గ్రీని.

ఈ ప్రాజెక్ట్‌లోకి రాకముందు ధనుష్ గురించి తెలియదన్న రైటర్.. తను ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించబోతున్నాడని గెస్ చేస్తున్నా అన్నారు. అతడు కిల్ టీమ్‌కు హెడ్‌గా ఉంటాడని అనుకుంటున్నానని, తను ఈ పాత్ర చేయడం ఆనందంగా ఉందని తెలిపాడు. సోషల్ మీడియా పాపులారిటీ చూశాకే ధనుష్ బిగ్ డీల్ అని అర్థం చేసుకున్నానన్న రైటర్.. తనకు ట్విట్టర్‌లో 6000 మంది ఫాలోవర్స్ ఉంటే ధనుష్‌కు ఏకంగా 9.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారని, ఈ ప్రాజెక్ట్‌ కమిట్ అయ్యాక ధనుష్ తనను ఫాలో కావడం వెరీ వెరీ బిగ్ డీల్ అన్నాడు. రీసెంట్‌గా ధనుష్‌కు సంబంధించిన కొన్ని వీడియోస్ చూశానని.. తనను ఈ మూవీలో చూసేందుకు ఎగ్జైట్ అవుతున్నానని చెప్పాడు. కాగా 200 మిలియన్ డాలర్ల వ్యయంతో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ స్పై థ్రిల్లర్‌‌లో ధనుష్ నటించడం పట్ల ఫ్యాన్స్ గర్వపడుతున్నారు. ఇక ఈ చిత్రంలో హాలీవుడ్ నటులు క్రిస్ ఇవన్స్, ర్యాన్ గ్లోసింగ్, అనా దె అర్మస్‌‌లతో కలిసి ధనుష్ నటించబోతున్నారు.



Next Story

Most Viewed