- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మాదకద్రవ్యాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం’
<p>దిశ, తెలంగాణ బ్యూరో : మాదకద్రవ్యాల అమ్మకాలను, తయారీని అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు జై రామ్ చందర్ ధ్వజ మెత్తారు.”Say No To Drugs” – రాష్ట్రంలో మాదకద్రవ్యాల తయారీ, వాడకానికి నిరసనగా శనివారం తెలుగుయువత, తెలుగుదేశం ఆధ్వర్యంలో హైదరాబాదులోని కెబీఆర్ పార్కు నుంచి నిరసన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మాదకద్రవ్యాల అమ్మకాలు విచ్చలవిడిగా పెరిగాయని, ఆ మత్తులో మహిళలపై దాడులు కూడా […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో : మాదకద్రవ్యాల అమ్మకాలను, తయారీని అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు జై రామ్ చందర్ ధ్వజ మెత్తారు.”Say No To Drugs” – రాష్ట్రంలో మాదకద్రవ్యాల తయారీ, వాడకానికి నిరసనగా శనివారం తెలుగుయువత, తెలుగుదేశం ఆధ్వర్యంలో హైదరాబాదులోని కెబీఆర్ పార్కు నుంచి నిరసన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మాదకద్రవ్యాల అమ్మకాలు విచ్చలవిడిగా పెరిగాయని, ఆ మత్తులో మహిళలపై దాడులు కూడా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం మాదకద్రవ్యాలు అరికట్టడంలో చోద్యం చూస్తుందని ఆరోపించారు. నివారణకు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో తెలుగు యువత ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు, టీడీపీ నాయకులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
- Tags
- drugs






