- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Crime News : స్నానం చేయడానికి బాత్రూంకు వెళ్లిన బాలిక.. అంతలోనే.!
<p>దిశ, కుత్బుల్లాపూర్ : నేటి సమాజంలో కామాంధులు రెచ్చిపోతున్నారు. ఇలాంటి ఘటనే జగద్గిరిగుట్టలో చోటు చేసుకుంది. కాపలా పనిచేసే ఓమహిళ కూతురిపై లైంగిక దాడికి యత్నించిన ప్రభుత్వ ఉద్యోగిని జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం…. గాజులరామారం సర్కిల్ మహాదేవపురం లోని జంతువుల సంరక్షణ కేంద్రంలో భాస్కర్ రావు (45) మేనేజర్ గా పనిచేస్తుంటాడు. అందులోనే ఓ మహిళ కాపలాదారుగా పని చేస్తూ పక్కనే గదిలో కుమార్తె(13)తో […]</p>

దిశ, కుత్బుల్లాపూర్ : నేటి సమాజంలో కామాంధులు రెచ్చిపోతున్నారు. ఇలాంటి ఘటనే జగద్గిరిగుట్టలో చోటు చేసుకుంది. కాపలా పనిచేసే ఓమహిళ కూతురిపై లైంగిక దాడికి యత్నించిన ప్రభుత్వ ఉద్యోగిని జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం…. గాజులరామారం సర్కిల్ మహాదేవపురం లోని జంతువుల సంరక్షణ కేంద్రంలో భాస్కర్ రావు (45) మేనేజర్ గా పనిచేస్తుంటాడు. అందులోనే ఓ మహిళ కాపలాదారుగా పని చేస్తూ పక్కనే గదిలో కుమార్తె(13)తో ఉంటుంది. వీరందరికీ కలిపి ఒకటే బాత్రూం ఉంది.
అయితే ప్లాన్ ప్రకారం కాచుకొని ఉన్న భాస్కర్ రావు గురువారం ఉదయం తల్లికి పని చెప్పి బయటకు పంపించాడు. కొద్దిసేపటి తర్వాత ఆ మైనర్ బాలిక స్నానం చేసేందుకని బాత్రూం కు వెళ్లగా అందులో ఉన్న భాస్కర్ రావు బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. ఆ బాలిక అరుపులు వేస్తూ బయటకి రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులను ఆశ్రయించగా 354 సెక్షన్ ప్రకారం ఫోక్సో కేసు నమోదు చేసుకున్న పోలీసులు భాస్కర్ రావు ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.






