- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటినుండి బయటకు వెళ్లిన బాలిక అదృశ్యం.. అసలేం జరిగింది..?
<p>దిశ, జవహర్ నగర్: ఇంటి నుండి బయటకు వెళ్లిన ఓ మైనర్ బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను శనివారం ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే… రాజస్థాన్‌లోని థౌసర్ మండలం నాగోర్ గ్రామానికి చెందిన నింబావత్ రాజేంద్ర తన భార్య, కుమారుడు, కూతురు హన్సిక (15) లతో కలిసి దమ్మాయి గూడ మున్సిపాలిటీ పరిధిలోని అయోధ్య నగర్‌లో గల వాటర్ ట్యాంక్ సమీపంలో నివాసం ఉంటున్నారు. కూతురు హన్సిక (15) స్థానిక మున్సిపాలిటీ లోని ఓ […]</p>

దిశ, జవహర్ నగర్: ఇంటి నుండి బయటకు వెళ్లిన ఓ మైనర్ బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను శనివారం ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే… రాజస్థాన్‌లోని థౌసర్ మండలం నాగోర్ గ్రామానికి చెందిన నింబావత్ రాజేంద్ర తన భార్య, కుమారుడు, కూతురు హన్సిక (15) లతో కలిసి దమ్మాయి గూడ మున్సిపాలిటీ పరిధిలోని అయోధ్య నగర్‌లో గల వాటర్ ట్యాంక్ సమీపంలో నివాసం ఉంటున్నారు.
కూతురు హన్సిక (15) స్థానిక మున్సిపాలిటీ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. గత కొన్ని రోజుల క్రితం రెండు సార్లు ఇంట్లో నుండి బయటకు వెళ్లి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చింది. ఇదే క్రమంలో ఈ నెల 7న ఇంట్లో నుండి వెళ్లిన హన్సిక ఇప్పటికీ తిరిగిరాలేదు. దీంతో హన్సిక తండ్రి రాజేంద్ర జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భిక్షపతి రావు తెలిపారు.






