ట్రంప్ గెలిస్తే అతనికి రూ. 112 కోట్లు

by  |
ట్రంప్ గెలిస్తే అతనికి రూ. 112 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తారని ఓ మాజీ బ్యాంకర్ భారీగా బెట్ వేశాడు. ఒకటి కాదు రెండు ఏకంగా ఐదు మిలియన్ డాలర్ల బెట్ వేశాడు. ఇండియా కరెన్సీ ప్రకారం అక్షరాల 37.5 కోట్లు. ట్రంప్ క్యాంపు ఆఫీసులో పలువురిని సంప్రదింస్తే విజయం సాధిస్తారని సమాచారం అందిందన్నారు. అందుకే భారీ మొత్తంలో బెట్ వేశానన్నారు. కరీబియన్‌లోని కురకావోలో ఓ బుక్ మేకర్‌తో పందెం కాసిన అతడు తాను పందెంలో గెలిస్తే 11.6 మిలియన్ పౌండ్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. అంటే దాదాపు 112 కోట్ల రూపాయలు రాగా అందులో 74.5 కోట్లు అదనంగా వరిస్తాయాంటూ ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. అయితే బుకీలు మాత్రం ట్రంప్ గెలుపు పై సందేహం వ్యక్తం చేస్తున్నారు. విజయాలు జో బైడెన్ వైపు ఉన్నాయని చెబుతున్నారు.

Next Story

Most Viewed