భార్య మరణం తట్టుకోలేక.. పిల్లలను చంపి..

by Shamantha N |

<p>దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీగా పనిచేస్తున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాళ్లోకి వెళితే&#8230; బెంగళూరులోని రమణసారి అపార్ట్‌మెంట్‌లో నేపాల్‌కు చెందిన జనకరాజ్ బిస్తా అనే వ్యక్తి సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితం అతని భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన జనకరాజ్ తన ముగ్గురు పిల్లలు సరస్వతి(14), హేమతి(9), రాజ్ కుమార్(3)లను హత్య చేశాడు. తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం [&hellip;]</p>

భార్య మరణం తట్టుకోలేక.. పిల్లలను చంపి..
X

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీగా పనిచేస్తున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాళ్లోకి వెళితే… బెంగళూరులోని రమణసారి అపార్ట్‌మెంట్‌లో నేపాల్‌కు చెందిన జనకరాజ్ బిస్తా అనే వ్యక్తి సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితం అతని భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన జనకరాజ్ తన ముగ్గురు పిల్లలు సరస్వతి(14), హేమతి(9), రాజ్ కుమార్(3)లను హత్య చేశాడు. తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం స్థానిక విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.

Next Story