దర్ధేపల్లిలో దారుణం.. తనయుడిని హత్య చేసిన తండ్రి…

209

దిశ, పాలకుర్తి : తండ్రి కొడుకుల మధ్య చోటుచేసుకున్న చిన్నపాటి ఘర్షణలో తనయుడిని తండ్రి హత్యచేసిన దారుణ సంఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్ధేపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మెరుగు రాజు, తండ్రి సమ్మయ్య మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. క్షణికావేశంలో సమ్మయ్య బహిర్భుమికి వెళ్లివస్తున్న తనయుడు రాజు పై దాడిచేసి దారుణంగా హత్యచేశాడని స్ధానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలయాల్సి ఉంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..