- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆడపిల్ల పుట్టిందని కన్నతండ్రి కర్కశత్వం.. ఏకంగా బండరాయితో..
<p>దిశ ,బెజ్జుర్ : కన్నతండ్రే ఓ పాప పాలిట కాల యముడుగా మారాడు. పేగు బంధాన్ని మరిచి, ఆడపిల్ల పుట్టిందని హతమార్చాడు. ఈ సంఘటన కొమురం భీం జిల్లా, లైన్ గూడ లో నిన్న రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. లైన్ గూడ కు చెందిన మిశ్రమ్ బాబురావు మహారాష్ట్రకు చెందిన మనీషాతో ఆరేళ్ల కిందట వివాహం జరిగింది . వీరికి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. మొదటి కూతురు ఐదు సంవత్సరాలు,రెండవ కూతురు మూడు సంవత్సరాలు. నెల […]</p>

X
దిశ ,బెజ్జుర్ : కన్నతండ్రే ఓ పాప పాలిట కాల యముడుగా మారాడు. పేగు బంధాన్ని మరిచి, ఆడపిల్ల పుట్టిందని హతమార్చాడు. ఈ సంఘటన కొమురం భీం జిల్లా, లైన్ గూడ లో నిన్న రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. లైన్ గూడ కు చెందిన మిశ్రమ్ బాబురావు మహారాష్ట్రకు చెందిన మనీషాతో ఆరేళ్ల కిందట వివాహం జరిగింది . వీరికి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. మొదటి కూతురు ఐదు సంవత్సరాలు,రెండవ కూతురు మూడు సంవత్సరాలు.
నెల క్రితం తన భార్య మనీషాకు మూడో కాన్పులో మళ్లీ ఆడపిల్ల జన్మించింది. దాంతో దంపతులిద్దరూ సోమవారం రాత్రి గొడవ పడ్డారు. దాంతో 40 రోజుల పసికందును తీసి రోడ్డుపై పడేశాడు. అంతటితో ఆగకుండా బండ రాయి తీసుకొని పసికందు తలపై మొదడంతో, ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై కాగజ్నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Next Story






