- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్లోబల్ ‘ఫ్యామిలీ మ్యాన్’
<p>దిశ, వెబ్‌డెస్క్ : మనోజ్ బాజ్‌పాయ్ ప్రధానపాత్రలో వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. రాజ్ అండ్ డీకే డైరెక్షన్‌లో వచ్చిన ఈ సూపర్ గ్రిప్పింగ్ సిరీస్ సీక్వెన్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా.. ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. ఇందుకు కొవిడ్ ఓ కారణమైతే, అమెజాన్ మార్కెటింగ్ స్టంట్ మరో కారణం. కేవలం హిందీలో విడుదలైన ఫస్ట్ పార్ట్‌కు గ్లోబల్ వైడ్‌గా సూపర్ రెస్పాన్స్ ఉండటంతో.. ఆ అవకాశాన్ని క్యాష్ చేసుకుంటూ […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : మనోజ్ బాజ్‌పాయ్ ప్రధానపాత్రలో వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. రాజ్ అండ్ డీకే డైరెక్షన్‌లో వచ్చిన ఈ సూపర్ గ్రిప్పింగ్ సిరీస్ సీక్వెన్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా.. ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. ఇందుకు కొవిడ్ ఓ కారణమైతే, అమెజాన్ మార్కెటింగ్ స్టంట్ మరో కారణం. కేవలం హిందీలో విడుదలైన ఫస్ట్ పార్ట్‌కు గ్లోబల్ వైడ్‌గా సూపర్ రెస్పాన్స్ ఉండటంతో.. ఆ అవకాశాన్ని క్యాష్ చేసుకుంటూ గ్లోబల్లీ రిలీజ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ డిసైడ్ అయింది. అంటే ఫారిన్ లాంగ్వేజెస్‌లోనూ సిరీస్‌ను డబ్ చేస్తోంది. అందుకే సిరీస్ రిలీజ్‌కు చాలా టైమ్ పడుతుందని తెలుస్తోంది. అమెజాన్ ఒరిజినల్‌గా వస్తున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ హిందీలో తెరకెక్కగా.. ఎట్ ఏ టైమ్ తెలుగు, తమిళ్‌తో పాటు ఫారిన్ లాంగ్వేజెస్‌లోనూ ఫిబ్రవరి 12న విడుదల కానుంది.
కాగా ఈ సిరీస్‌లో సౌత్ స్టార్ సమంత కూడా నటిస్తుండడం విశేషం. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’లో సామ్ నెగెటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుండగా.. ఈ సిరీస్‌తోనే వెబ్ వరల్డ్‌లోకి అడుగుపెట్టబోతుంది అక్కినేని వారి కోడలు.






