మనోజ్ బాజ్‌పాయ్.. బ్యాక్ ఇన్ యాక్షన్

53

దిశ, వె‌బ్‌డెస్క్ : ది మోస్ట్ అవెయిటెడ్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీజర్ రిలీజైంది. ప్రేక్షకులు ఊహించినట్లుగానే టీజర్‌ను చాలా గ్రిప్పింగ్‌గా అందించిన మేకర్స్.. రెండో సీజన్‌పై ఆసక్తిని పెంచారు. ఈ సీజన్‌లో మనోజ్ బాజ్‌పాయ్‌తో పాటు టాలీవుడ్ బ్యూటీ సమంత అక్కినేని కూడా కనిపించగా.. షరీబ్ హష్మి, శ్రేయా ధన్వంతరి, ప్రియమణి, సన్నీ హిందుజ పాత్రలు యథావిధిగా కంటిన్యూ చేశారు.

‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్‌ వన్‌ను అద్భుతంగా తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే.. రెండో సీజన్‌ను కూడా అంతే ఆసక్తిగా అందించే ప్రయత్నం చేశారని టీజర్ స్నీక్ పీక్ చూస్తే అర్థమవుతోంది. ‘ప్రియమణి (సుచిత్ర), మనోజ్ (శ్రీకాంత్)ల మధ్య సంఘర్షణ అదే విధంగా కొనసాగుతుండగా, ఆ ఇద్దరి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్‌ను వాళ్ల కూతురు ప్రశ్నిస్తుంది. ఈ స్నీక్ పీక్ చివర్లో కనిపించిన మనోజ్.. మరో ఆపరేషన్‌లో భాగమైనట్లు తెలుస్తోంది. ఇక చాలా సాదాసీదా దుస్తుల్లో, అమాయకమైన మోముతో సమంత పాత్రను రివీల్ చేయడం విశేషం.

‘ది ఫ్యామిలీ మ్యాన్ ప్రపంచానికి తిరిగి వచ్చినందుకు మేము సంతోషిస్తున్నాం. మొదటి సీజన్‌కు అనూహ్య స్పందన లభించింది, ప్రేక్షకుల అంచనాల మేరకు రెండో సీజన్ కూడా అంతే ఆకర్షణీయంగా, స్పెల్ బౌండింగ్‌గా అందించే ప్రయత్నం చేశాం. ద వెయిట్ ఈజ్ ఓవర్.. జనవరి 19న ట్రైలర్, ఫిబ్రవరి 12న వెబ్ సిరీస్ విడుదల కానున్నాయి. కొవిడ్, లాక్డౌన్ వంటి కఠిన పరిస్థితుల్లో అన్ని అడ్డంకులు దాటుకుని పనిచేసిన మా టీమ్‌కు ధన్యవాదాలు. రెండో సీజన్‌లో ఎన్నో సర్‌ప్రైజెస్ ప్రేక్షకుల కోసం వేచి చూస్తున్నాయి’ అని రాజ్, డీకే వెల్లడించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..