నా రియల్ లైఫ్ చెల్లం సార్.. తనే : మనోజ్

by  |
Manoj Bajpayee
X

దిశ, సినిమా: అమెజాన్ ప్రైమ్ లేటెస్ట్ హిందీ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’కు ఎంత పేరొచ్చిందో.. సోషల్ మీడియాలో ‘చెల్లం సార్‌’ క్యారెక్టర్‌‌పై అంత అటెన్షన్ క్రియేట్ అయింది. ఈ పాత్రను తమిళ్ యాక్టర్, డైరెక్టర్ అయిన ఉదయ్ మహేశ్ పోషించగా.. సిరీస్‌లో శ్రీకాంత్ తివారి(మనోజ్ బాజ్‌పాయ్) ట్రబుల్స్‌లో ఉన్నప్పుడు సలహా కోసం చెల్లం సార్‌ను కాంటాక్ట్ చేస్తుంటాడు. ఇక తన రియల్ లైఫ్ చెల్లం సార్ ఎవరో తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు మనోజ్. ఇప్పటివరకు తనతో కలిసి పనిచేసిన డైరెక్టర్లలో నీరజ్ పాండే, అభిషేక్ దూబే, రాజ్ అండ్ డీకే, అనురాగ్ కశ్యప్‌లను ఇష్టపడతానని, వారితో ఎలాంటి సమస్యనైనా డిస్కస్ చేస్తానని తెలిపాడు. అయితే ప్రత్యేకించి ‘ఫ్యామిలీ మ్యాన్2’ డైరెక్టర్స్‌లో ఒకరైన సుపర్ణ వర్మ తనకు రియల్ చెల్లం సార్ అని పేర్కొన్నాడు. ఏ ప్రాబ్లమ్ గురించి, ఎప్పుడు కాల్ చేసినా వర్మ దగ్గర ఆన్సర్ కచ్చితంగా ఉంటుందని వెల్లడించాడు. కాగా ‘ఫ్యామిలీ మ్యాన్2’కు ప్రేక్షకులతో పాటు క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కుతున్న విషయం తెలిసిందే.



Next Story

Most Viewed