సమంతతో ఇంటిమేట్ సీన్స్ డిలీట్ చేశారు : కోస్టార్

by  |
సమంతతో ఇంటిమేట్ సీన్స్ డిలీట్ చేశారు : కోస్టార్
X

దిశ, సినిమా :‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌లో టాలీవుడ్ స్టార్ సమంత అక్కినేని తన పర్ఫార్మెన్స్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేసింది. కాగా ఆ సిరీస్‌లో తమిళ్ రెబల్స్ సీక్రెట్ ఆపరేషన్‌ను లీడ్ చేసే సమంత(రాజీ)కు సాజిద్ రోల్ ప్లే చేసిన షాహబ్ అలీ హెల్ప్ చేస్తుంటాడు. ఈ క్రమంలో సామ్ తనతో ప్రేమలో పడుతుందని, ఇద్దరి మధ్య కొన్ని ఇంటిమేట్ సీన్స్ కూడా షూట్ చేశారని సాజిద్ వెల్లడించాడు. అయితే ఫైనల్ ఎడిటింగ్‌లో ఆ సీన్లను తొలగించినట్టు పేర్కొన్నాడు.

అయితే పర్టిక్యులర్‌గా అలాంటి సీన్స్ మాత్రమే తీసేయలేదని, ఎడిటింగ్ ప్రాసెస్‌లో భాగంగా కొంత పోర్షన్ డిలీట్ చేయాల్సి వచ్చిందని తెలిపాడు. ఎక్స్‌ట్రీమిస్ట్స్ క్యారెక్టర్స్‌లో నటించిన వీరిద్దరూ భారత్‌లో సూసైడ్ అటాక్స్ చేసేందుకు అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రత్యేక లక్ష్యం కోసం పనిచేస్తూ ఏ మనిషితోనూ ఎటువంటి ఎమోషనల్ బాండింగ్ లేని క్రూయల్ నేచర్‌‌ను స్ర్కీన్‌పై అత్యద్భుతంగా ఆవిష్కరించగా.. చివరగా వీరిమధ్య సాఫ్ట్ కార్నర్ డెవలప్ అయినట్టు చూపించారు మేకర్స్. కాగా రాజ్ అండ్ డీకే ప్రొడ్యూస్ చేసిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అమెజాన్ ప్రైమ్‌లో సక్సెస్‌ఫుల్‌గా స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed