భార్య మంగళ సూత్రం అమ్మిన భర్త… శభాష్ అంటున్న నెటిజన్లు  

by  |
భార్య మంగళ సూత్రం అమ్మిన భర్త… శభాష్ అంటున్న నెటిజన్లు  
X

దిశ, వెబ్ డెస్క్ : కరోనా బాధితులంటేనే ఆమడదూరం పారిపోయే ఈరోజుల్లో… కొంతమంది ఆక్సిజన్ అందించి మానవత్వం చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన ఇద్దరు పదవ తరగతి విద్యార్థులు స్నేహ రాఘవన్, శ్లోక అశోక్ ఇద్దరు చిన్న పిల్లలు రెండు లక్షలకు పైగా డబ్బులు వసూలు చేసి పేదలకు ఆక్సీమీటర్స్ అందించి వారి ప్రాణాలు కాపాడారు. అలానే మధ్యప్రదేశ్ భోపాల్‌కు చెందిన ఆటో-రిక్షా డ్రైవర్ జావేద్ఖాన్ అనే ఆటో డ్రైవర్ తన గొప్ప మనస్సును చాటుకున్నాడు.

ఆటో నడిపితేనే కానీ కుటుంబాన్ని పోషించుకోలేని అతను తన ఉన్నతమైన మనస్సుతో కరోనా రోగులకు సహాయం చేస్తున్నాడు. ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న వారి కోసం తనవంతు సహాయంగా తన ఆటోనే అంబులెన్స్ గా మార్చాడు. దీనికోసం తాను ఏకంగా తన భార్య తాళిబొట్టును తాకట్టు పెట్టి ఆటోను అంబులెన్సుగా మార్చి, ఆటోలో శానిటైజర్లు, కొన్ని మందులు, ఆక్సిజన్ సిలిండర్‌ను ఏర్పాటు చేశానని వెల్లడించాడు. ఆక్సిజన్ లేక.. సకాలంలో ఆసుపత్రికి వెళ్లలేక బాధితులు ఇబ్బందులు పడుతున్న వారికోసం తన ఆటోలోనే ఆక్సిజన్ ఏర్పాటు చేసి కరోనా బాధితులకు ఉచితంగా ఆక్సిజన్ అందిస్తున్నాడు. ఇతను చేస్తున్న ఈ పనికి అందరూ శభాష్ అంటున్నారు.



Next Story

Most Viewed